Is Weight loss Possible?
బరువు తగ్గడానికి వాకింగ్, రన్నింగ్ సహాయపడతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు రోజూ కనీసం 30 నిమిషాల పాటు తీవ్రస్థాయి వ్యయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, స్ట్రెచర్స్ ఇలా ఒక్కోటి ఐదు నిమిషాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వులు కరిగిపోయి కండరాలు దృఢంగా తయారవుతాయి. వీటితో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.
బరువు తగ్గించుట కోసం డైట్ చార్ట్ – Diet chart for weight loss
బరువు నష్టం కోసం రోజువారీ రొటీన్
నం ఉయం పూట తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటుంది. సాధారణంగా ఉదయం పూట ఇడ్లీ, దోసె వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాం. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రొటీన్లు మీ ఆకలను నియంత్రిస్తాయి, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Weight Loss Tips In Telugu
- మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఎక్కువగా నడవటానికి ప్రయత్నించండి. ఎలివేటర్కు బదులుగా మెట్లు ఎక్కండి, దగ్గర షాపులకు వెళ్లేప్పుడు.. నడవండి.
- మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. ఫైబర్ మీ కడుపును నిండుగా ఉంచుతుంది, తద్వారా మీరు అతిగా ఆహారం తినకుండా ఉంటారు.
- రోజంతా బాగా హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు లేదా హెర్బల్ టీని తాగండి. ఆకలిని అరికట్టడానికి మరొక మార్గం భోజనానికి ముందు నీరు తాగడం.
- మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.